Congress Cold War | నల్గొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చినట్లు కనిపిస్తున్నది. డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత జన్మదినం సందర్భంగా ఆయన అనుచరులు జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే వాటిలో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫొటోలు లేకపోవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ నేపథ్యంలో పున్న కైలాష్ అనుచరులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు రాత్రికి రాత్రే చించివేయడంతో వివాదం మరింత ముదిరింది. ఈ ఘటన వెనుక కోమటిరెడ్డి అనుచరుల హస్తం ఉందని కైలాష్ వర్గీయులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కాంగ్రెస్లో ఇప్పటికే వర్గపోరు కొనసాగుతుండగా.. తాజా ఘటన ఆ వివాదాలకు మరింత బలం చేకూర్చినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.