భారీ వర్షాలతో రామగుండంలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
బొగ్గు ఉత్పత్తి| జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రామగుండం రీజీయన్‌లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ ప్రాంతంలో నాలుగు ఓపెన్ కాస్టు గనులు ఉన్నాయి. వర్షాలు కురుస్తుండటంతో నీరు నిలిచింది.

పెద్దపల్లి: జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రామగుండం రీజీయన్‌లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ ప్రాంతంలో నాలుగు ఓపెన్ కాస్టు గనులు ఉన్నాయి. వర్షాలు కురుస్తుండటంతో నీరు నిలిచింది. దీంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. రోజుకు 30 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోనుంది.
హైదరాబాద్‌లో ఇవాళ ఉదయం నుంచి వర్షం కురుస్తున్నది. మియాపూర్, కూకట్పల్లి, ఎర్రగడ్డ, అమీర్‌పేట, బేగంపేట, సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్, దిల్సుఖ్నగర్, మలక్‌పేట, వనస్థలిపురం, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మసబ్ ట్యాంక్, మెహిదీపట్నం, యూసఫ్‌గూడ, కృష్ణానగర్, పంజాగుట్ట, కూకట్పల్లి, జీడిమెట్లతో పాటు పరిసర ప్రాంతాల్లో వాన కురుస్తోంది. వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి.
స్థిరంగా కొనసాగుతున్న అల్ప పీడనం
వాయవ్వ బంగాలాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతున్నది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపోస్పియర్ స్థాయివరకు వ్యాపించింది. ఇది రానున్న రెండు మూడు రోజుల్లో మరింత బలపడి పశ్చిమ వాయవ్యదిశగా ఒడిశా, జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్ మీదుగా వెళ్లే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతోరాష్ట్రంలో ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ సోమ, మంగళవారాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హెచ్చరించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tushar Gandhi | నిరసనలో పాల్గొనేందుకు వెళ్తుండగా మహాత్మాగాంధీ మునిమనువడు అరెస్ట్..!
Dhruv Rathee | సీజేపీ నిరసనకు వెళ్లకుండా యూట్యూబర్ ధృవ్ రాఠీని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు
Vitamin D | ఎముకలే కాదు, గుండె ఆరోగ్యాన్ని సైతం కాపాడే విటమిన్ డి.. అధ్యయనంలో వెల్లడి..
Gold Locket | శ్రీవారికి బంగారు లాకెట్, ముత్యాలహారం విరాళం
Grammys 2027 | గ్రామీ బరిలో ‘ధురంధర్’ సౌండ్‌ట్రాక్.. ఏకంగా ఎనిమిది కేటగిరీల్లో ఎంట్రీలు!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

