కాచిగూడ, జూన్ 20 : తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అసమర్థ పాలనతోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కృష్ణ, గోదావరి జలాల దోపిడీ కుట్రకు తెరలేపాడని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ ధ్వజమెత్తారు. కాచిగూడలోని ఓ హోటల్లో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించి జాతీయ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ గుజ్జ కృష్ణతో కలిసి మాట్లాడారు.. బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటామని ఏపీ సీఎంను హెచ్చరించారు. తెలంగాణకు కృష్ణ, గోదావరి జలాలు జీవనాధారమని, ఆ నీటిని ఏపీకి అప్పగిస్తే సీఎం రేవంత్‌ను గద్దె దించడం ఖాయమని స్పష్టం చేశారు.
57 ఏళ్లుగా ఆంధ్ర పాలకులు జల దోపిడీకి పాల్పడుతున్నారని, ప్రత్యేక రాష్ట్రమొచ్చినా దోచుకుంటూనే ఉన్నారని ఎద్దేవా చేశారు. ఏపీ సీఎం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తెలంగాణ జలాలను ఆంధ్రకు తరలించేందుకు తీవ్రంగా యత్నిస్తున్నాడని, ఆ కుట్రను రాష్ట్ర ప్రజలతో కలిసి అడ్డుకుంటామని హెచ్చరించా రు. కేంద్రం పోలవరం ప్రాజెక్టుకు నిధు లు విడుదల చేసిందని, ప్రాణహిత చేవెళ్లకూ మంజూరు చేయాలని డి మాండ్ చేశారు. కార్యక్రమంలో శ్రీనివాస్ యాదవ్, కోల జనార్దన్, సుధాకర్, నందగోపాల్, గోపి, వంశీ, ఉదయనేత, రజిని పాల్గొన్నారు.