హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ): సంక్రాంతి సందర్భంగా పతంగులు ఎగురవేసే సమయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని.. కరెంటు లైన్లు, వైర్లకు దూరంగా ఉండాలని దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) సీఎండీ రఘుమారెడ్డి సూచించారు. విద్యుత్తు లైన్లు, ట్రాన్స్ఫార్మర్ల వద్ద పతంగులు ఎగుర వేయవద్దని, విద్యుత్తు పరికరాలపై పతంగులు/మాంజాలు తెగిపడితే వాటి జోలికెళ్లొద్దని పేర్కొన్నారు. కరెంటు వైర్లు తెగి రోడ్డుపై పడితే వెంటనే 1912 లేదా సంస్థ మొబైల్ యాప్, www.tssouthernpower.com ద్వా రా ఫిర్యాదు చేయాలని సీఎండీ సూచించారు.