హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): వర్షాల కారణంగా బొగ్గు ఉత్పత్తి రవాణాకు ఆటంకాలు ఎదురుకావడంతో లక్ష్యాన్ని చేరుకోలేకపోయామని సింగరేణి సీఎండీ ఎన్ బలరాం స్పష్టం చేశారు.
ఈ నష్టాన్ని పూడ్చుకోవడానికి ప్రతిరోజూ 2.4 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి రవాణాను సాధించాలని ఏరియాల జనరల్ మేనేజర్లకు సూచించారు. హైదరాబాద్లోని సింగరేణి భవన్లో సంస్థ డైరెక్టర్లు, వివిధ ఏరియాల జనరల్ మేనేజర్లతో గురువారం సమావేశమయ్యారు.