CM Jagan | దేశం షాక్ అయ్యేలా వైసీపీ ప్రభంజనం.. 2019లో కంటే ఎక్కువ సీట్లు గెలుస్తాం: ఏపీ సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ ప్రభంజనం ఖాయమని, మళ్లీ తాము అధికారంలోకి రాబోతున్నామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలను చూసి దేశం షాక్ అవుతుందని చెప్పారు.
- ఐప్యాక్ ప్రతినిధుల భేటీలో ఏపీ సీఎం జగన్
CM Jagan | హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ ప్రభంజనం ఖాయమని, మళ్లీ తాము అధికారంలోకి రాబోతున్నామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలను చూసి దేశం షాక్ అవుతుందని చెప్పారు. ప్రశాంత్‌కిశోర్ కూడా ఉహించలేనన్ని సీట్లు సాధించబోతున్నామని పేర్కొన్నారు. గురువారం విజయవాడలోని బెంజిసర్కిల్‌లో ఉన్న ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐప్యాక్) ప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు.
సుమారు 25 నిమిషాలపాటు ఐప్యాక్ కార్యాలయంలో గడిపారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. 2019లో 151 సీట్లు, 22 ఎంపీ సీట్లు గెలిచామని, ఈ సారి అంతకంటే ఎక్కువ స్థానాలు గెలుస్తామని చెప్పారు. ఫలితాల తర్వాత దేశం మొత్తం ఏపీ వైపే చూస్తుందని పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కోసం పొలిటికల్ కన్సల్టెన్సీగా ఐప్యాక్ పనిచేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

