హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తేతెలంగాణ) : పేద, మధ్య తరగతి విద్యార్థులకు సాంకేతిక విద్య అందించే బాసర ట్రిపుల్ ఐటీలో పిల్లలు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్ ఆవేదన వ్యక్తంచేశారు. హైదరాబాద్‌లో మంగళవారం వారు మీడియాతో మాట్లాడుతూ విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ర్యాగింగ్ ఆరోపణ ల నేపథ్యంలో అధికారులు క్యాంపస్‌ను సందర్శించాలన్నారు. విద్యార్థిని స్వాతిప్రియ ఆత్మహత్యపై అనుమానాలున్నాయని తల్లిదండ్రులు తెలిపినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని పేర్కొన్నా రు. అధికారంలోకి రాగానే ట్రిపుల్ ఐటీకి వస్తానన్న రేవంత్‌రెడ్డి హామీని గుర్తుచేశా రు. 11నెలలు కావస్తున్నా విద్యాశాఖకు ప్రత్యేక మంత్రిని నియమించలేదని విమర్శించారు. వెంటనే సీఎం బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించాలని డిమాండ్ చేశారు.