Revanth Reddy | హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ప్రకటనలపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం హోదాలో ఉండి అడ్డగోలుగా అబద్ధాలు చెప్పారంటూ మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు మండిపడుతున్నారు. ఎన్నికల్లో మహాలక్ష్మి పేరుతో గ్యారెంటీలు ఇచ్చిన రేవంత్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను అటకెక్కించారని నిప్పులు చెరుగుతున్నారు. సీఎం చెప్పిన మాటల్లో తప్పులను ఒక్కొక్కటిగా వివరిస్తూ మహిళా సంఘాల నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. కేసీఆర్ హయాంలో మహిళా సంఘాలకు మూడు విడుతలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి ఆదుకున్నారని తెలంగాణ మహిళా సంఘాల ప్రతినిధి సునీత స్పష్టంచేశారు.
మహిళలకు కేసీఆర్ ఇచ్చిన వరాలు
కాంగ్రెస్ వచ్చింది.. పథకాలు ఆపింది
కేసీఆర్ ప్రభుత్వం మహిళల కోసం అమలు చేసిన పథకాలను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిలిపివేసిందని మహిళా సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఎన్నికల సమయంలో హామీలులిచ్చి అధికారంలోకి వచ్చాక మరిచిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కల్యాణలక్ష్మి కింద అదనంగా తులం బంగారం ఇస్తారన్నారని, ఇంతవరకు అతీగతీ లేదని విమర్శిస్తున్నారు. పింఛన్ల పెంపు ఊసేలేదని, రూ.2,500 పథకం, సూటీల పంపిణీ ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు.
రేవంత్రెడ్డి ప్రకటన
మహిళల ప్రతిఘటన