Runa Mafi | మాఫీకి మరో వాయిదా?.. సీఎం రేవంత్‌రెడ్డి మాటలతో రైతాంగంలో గందరగోళం
రైతు రుణమాఫీపై సీఎం రేవంత్‌రెడ్డి చెప్తున్న మాటలు అన్నదాతలను గందరగోళానికి గురిచేస్తున్నాయి. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలతో గడువులోపు రుణమాఫీ పూర్తవుతుందా? అనే సందేహాలు నెలకొన్నాయి.
- ఆగస్టు నెలలో రుణమాఫీ పూర్తిచేస్త: సీఎం
- కల్వకుర్తిలో రెండుసార్లు నొక్కిచెప్పిన రేవంత్
- 2వ తేదీ నుంచి 14 వరకు విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చాక మాఫీ పూర్తిచేస్తానని హామీ
- అంటే పంద్రాగస్టులోపు పూర్తికానట్టేనా?
- రైతుల్లో వ్యక్తమవుతున్న అనుమానాలు
‘నేను ఆగస్టు 2వ తారీఖు నుంచి 14 వరకు విదేశాలకు వెళ్తున్న. తిరిగి వచ్చిన వెంటనే ఆగస్టులోగా రైతులకు రెండు లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తా’
– కల్వకుర్తి సభలో సీఎం రేవంత్
Runa Mafi | హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ) /నాగర్‌కర్నూల్ : రైతు రుణమాఫీపై సీఎం రేవంత్‌రెడ్డి చెప్తున్న మాటలు అన్నదాతలను గందరగోళానికి గురిచేస్తున్నాయి. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలతో గడువులోపు రుణమాఫీ పూర్తవుతుందా? అనే సందేహాలు నెలకొన్నాయి. ‘నెలాఖరులోపు లక్షన్నర వరకు మాఫీ చేస్తం. ఆగస్టులోగా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తం. నేను విదేశాలకు వెళ్లి వచ్చిన వెంటనే రుణమాఫీ పూర్తిచేస్తం’ అని సీఎం రేవంత్‌రెడ్డి మరోమారు స్పష్టం చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలం కొట్ర చౌరస్తాలో దివంగత జైపాల్‌రెడ్డి విగ్రహాన్ని మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావుతో కలిసి ఆదివారం ఆవిష్కరించిన అనంతరం కల్వకుర్తి పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్ ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పటికే రుణమాఫీపై రైతాంగంలో గందరగోళం నెలకొన్నది. లక్షలోపు రుణాలన్నీ మాఫీ చేసినట్టు ప్రభుత్వం చెప్తున్నా.. దాదాపు సగం మంది రైతులు తమకు జరగనే లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టులో తన విదేశీ పర్యటన తర్వాత రూ.2 లక్షల వరకు మాఫీ చేస్తానని ముఖ్యమంత్రి తాజాగా చెప్పడంతో అనుమానాలు మరింత తీవ్రమయ్యాయి.
అసలు సీఎం విదేశీ పర్యటనకు, రుణమాఫీ అమలుకు సంబంధం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతున్నది. మరోసారి రుణమాఫీ గడువు మారుతున్నదా అనే చర్చ జరుగుతున్నది. ఎన్నికలకు ముందు డిసెంబర్ 9న రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు చెప్పుకొచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక ఆ తేదీ మారిపోయింది. మొదట్లో ఆ హామీని కాంగ్రెస్ సర్కార్ అటకెక్కిస్తున్నదన్న ప్రచారమూ సాగింది. ‘ఆగస్టు 15లోపు రుణమాఫీ సహా గ్యారెంటీలన్నీ అమలు చేయకపోతే రాజీనామాకు సిద్ధమా..?’ అంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు సవాల్ విసరడంతో.. రేవంత్‌రెడ్డిపై ఆ ఒత్తిడి బలంగా పనిచేసింది. దీంతో ఆగస్టు 15 నాటికి రుణమాఫీ పూర్తిచేస్తామని రేవంత్ ప్రకటించాల్సి వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో నిర్వహించిన అన్ని సభల్లోనూ ఆగస్టు 15 లోపు రుణమాఫీపై దేవుళ్లందరి మీద రేవంత్ ఒట్లు పెట్టారు. తాజాగా కల్వకుర్తి సభలో మాత్రం ఆగస్టు 15 అని అనకుండా ఆగస్టులోగా చేస్తామంటూ నర్మగర్భపు వాఖ్యలు చేశారని, దీని వెనుక ఏదో మర్మం ఉన్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పర్యటనకు.. రుణమాఫీకి సంబంధమేంటి?
తాను 14 వరకు విదేశీ పర్యటనకు వెళ్తున్నానని, తిరిగి రాగానే మొత్తం రుణమాఫీ చేస్తానంటూ సీఎం చేసిన ప్రకటనపై నిపుణులు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. విదేశీ పర్యటనకు రుణమాఫీ పూర్తికి సంబంధమేమిటని ప్రశ్నిస్తున్నారు. 14న వస్తే 15లోగా రుణమాఫీ చేయవచ్చు కదా అని సందేహిస్తున్నారు. తమకు డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాలు ఇవ్వకపోవడంపై ముఖ్యమంత్రి సభలో మహిళలు నిరసన తెలిపారు. ఆదివారం జరిగిన సభలో నియోజకవర్గ అభివృద్ధికి 309 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. రేవంత్‌రెడ్డి ప్రసంగం ప్రారం భం కాగానే డిమాండ్లతో కూడిన పేపర్లను ప్రదర్శించారు. పోలీసులు వచ్చి కాగితాలను గుంజుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
డిండి ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయాలి : జూలకంటి రంగారెడ్డి
Madhyapradesh | ఉజ్జయినిలో పెను విషాదం.. విషవాయువు పీల్చి నలుగురు హోటల్ కార్మికులు మృతి
RC 17 Begins | పాన్-ఇండియా రేంజ్లో రామ్‌చరణ్ – సుకుమార్ కొత్త సినిమా ప్రారంభం.. క్లాప్ కొట్టిన చిరు!
Jagan helicopter | వైఎస్ జగన్‌పై చంద్రబాబు సర్కార్ కుట్రలు? జగన్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో కాజోల్.. బాలకృష్ణతో కలిసి కీలక పాత్రలో కనిపించనున్నారా?
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

