హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): తిరుమల కొండపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున భవనాలు నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వెల్లడించారు. బుధవారం సీఎం రేవంత్రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి తి రుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం సీఎం రేవంత్రెడ్డి మీడియాతో మాట్లాడారు. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని, రెండు రాష్ర్టాలు అభివృద్ధిపథం వైపు ముందుకెళ్లాలని, తెలుగు ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నట్టు చెప్పారు.