హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్హెచ్చార్డీ)ను సీఎం రేవంత్రెడ్డి ఆదివారం సందర్శించారు. సిబ్బందితో ప్రత్యేకంగా మాట్లాడారు. సంస్థ కార్యకలాపాలను, అక్కడ ఉద్యోగులకు ఇస్తున్న శిక్షణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. సంస్థలోని వివిధ బ్లాకులను పరిశీలించారు. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ శశాంక్ గోయల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సంస్థ కార్యకలాపాలను వివరించారు. సీఎం వెంట పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక, సంస్థ అడిషనల్ డైరెక్టర్ మహేశ్ దత్, సీజీజీ డీజీ రాజేంద్ర నిమ్జే, మాజీ మంత్రి షబ్బీర్ అలీ తదితరులు ఉన్నారు.