హైదరాబాద్, మే 23(నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లారు. శుక్రవారం సాయంత్రం బయల్దేరి వెళ్లారు. సీఎం అయినప్పటి నుంచి రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లడం ఇది 44వసారి కావడం గమనార్హం. ప్రస్తుత పర్యటనలో భాగంగా శనివారం ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనున్నారు.
సమావేశంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌ను వివరించనున్నారు. సమావేశం అనంతరం కాంగ్రెస్ పెద్దలతోపాటు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉందని తెలిసింది. నేషనల్ హెరాల్డ్ కేసు చార్జిషీట్లో రేవంత్‌రెడ్డి పేరున్నట్టు వార్తలు రావడంతో అధిష్ఠానం పెద్దలను కలిసే అవకాశం ఉందని తెలిసింది.