హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్రెడ్డి మరోమారు శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారు. సీఎంగా ఆయన ఢిల్లీకి వెళ్లటం ఇది 44వ సారి. ఢిల్లీలో శనివారం జరిగే నీతిఆయోగ్ సమావేశంలో సీఎం పాల్గొననున్నారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు గురువారం సాయంత్రమే ఢిల్లీ వెళ్లిపోయారు. ఆయన శుక్రవారం ఢిల్లీలోనే ఉండి, విభజన సమస్యలపై కేంద్ర మంత్రులతో మాట్లాడుతారని ఏపీ సీఎంవో మీడియాకు తెలిపింది.
ప్రధానంగా షెడ్యూల్ 9, 10లోని పెండింగ్ సమస్యలతోపాటు, బనకచర్ల ప్రాజెక్టు మీద చంద్రబాబు ఫోకస్ పెట్టినట్టు తెలిసింది. తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి టూర్ షెడ్యూల్ ఇప్పటివరకైతే బహిర్గతం కాలేదు. ఆయన కేవలం నీతిఆయోగ్ సమావేశానికే పరిమితం అవుతారా? లేక కేంద్ర మంత్రులను కలుస్తారా? అనే అంశాలను సీఎంవో బయటి చెప్పలేదు.