హైదరాబాద్: ఆధునిక పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా యువతను తీర్చిదిద్దేందుకుగానూ ఐటీఐలను (ITI) ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా (ATC) మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఐటీఐలను ఏటీసీలుగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నిర్ణయించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 65 ఐటీఐలను ఏటీసీలుగా అప్ గ్రేడ్ చేసేందుకురాష్ట్ర ప్రభుత్వం టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ (TTL)తో పదేండ్లకుగానూ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటలకు మల్లేపల్లి ఐటీఐలో ఏటీసీలకు సీఎం రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. ఐటీసీలకు సంబంధించిన ముఖ్య అంశాలు..