హైదరాబాద్, జూన్ 4(నమస్తే తెలంగాణ): ఎనిమిది ఎంపీ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్కు విజయం అందించిన ప్రజలకు సీఎం రేవంత్రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఫలితాలపై స్పందించిన ఆయన పత్రికా ప్రకటన జారీచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ 100 రోజుల పాలనను ఆశీర్వదిస్తూ ఎనిమిది లోక్సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ శాసనసభ ఉపఎన్నికలో విజయం చేకూర్చారని పేర్కొంటూ రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ఈ విజయంతో అందించిన ఆశీర్వాదాలు తమలో ఆత్మైస్థెర్యాన్ని పెంచాయని అన్నారు. ఈ ఫలితాలు మరింత సమర్థ పాలన అందించేందుకు ఉత్సాహాన్నిచ్చాయని తెలిపారు. ప్రజల మద్దతు కాంగ్రెస్ పార్టీకే ఉన్నదన్న విషయాన్ని ఈ ఫలితాలు మరో సారి రుజువు చేశాయని స్పష్టంచేశారు. కాంగ్రెస్ విజయా నికి పనిచేసిన కార్యకర్తలు, నాయకులు, శ్రేయోభిలాషులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల కోడ్ ముగుస్తుందని, ఇక రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పాలన అందిస్తామని తెలిపారు.