హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): హెచ్‌సీయూ భూముల అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్‌కు చెంపపెట్టు లాంటిందని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి బుధవారం తెలిపారు. ఈ తీర్పు ప్రకృతి ప్రేమికులు, బీఆర్ఎస్ విజయమని అభివర్ణించారు. కంచ గచ్చిబౌలి భూమి అటవీ ప్రాంతమే కాదని, అందులో జంతువులు లేవంటూ ఇన్ని రోజులు అందరినీ తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసిన సర్కార్‌కు సుప్రీంతీర్పు దిమ్మదిరిగే షాక్‌లా ఉందని చెప్పారు. విద్యార్థులపై, ప్రశ్నించిన ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలపై కేసులు పెట్టి రాక్షసానందం పొందిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఇప్పటికైనా తన విధానాన్ని మార్చుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అటు కంచ గచ్చిబౌలి భూముల అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తెలంగాణ ప్రజల విజయమని బీఆర్ఎస్వీ ఉపాధ్యక్షుడు పడాల సతీశ్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్‌కు వన్యప్రాణులను, అడవులను కాపాడాలంటూ ఆదేశాలు ఇవ్వడం హర్షించదగిన విషయమని పేర్కొన్నారు. ఈ అంశంపై గల్లీ నుంచి ఢిల్లీ వరకు హెచ్‌సీయూ విద్యార్థులకు అండగా నిలిచిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.