హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ)/ రవీంద్రభారతి : కోఠి మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెడతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రవీంద్రభారతిలో మంగళవారం నిర్వహించిన చాకలి ఐలమ్మ వర్ధంతి సభ లో సీఎం పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ చరిత్ర మరువలేనిదని, ఐలమ్మ స్ఫూర్తితో భూములను కాపాడుతున్నామన్నారు. ఆమె మనుమరాలు శ్వేతను తెలంగాణ మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమిస్తున్నట్టు ప్రకటించారు.
అనంతరం ఐలమ్మ కుటుంబసభ్యులను సీఎం రేవంత్‌రెడ్డి సన్మానించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్‌గౌడ్, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా గత కేసీఆర్ సర్కారు 2022-23లో కోఠి మహి ళా కాలేజీని వర్సిటీగా అప్‌గ్రేడ్ చేసి ‘తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం’ పేరును ఖరారు చేసి, 100 కోట్ల నిధులను ప్రకటించింది. రెం డేండ్లుగా వర్సిటీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఐల మ్మ పేరును పెడతామని సీఎం ప్రకటించారు. తెలుగు వర్సిటీ పేరు మార్పుపైనా ఊహాగానాలు వెలువడుతున్నాయి.