హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): మన బొగ్గు.. మన హకు అని, కాపా డి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బొగ్గు గనుల వేలంపై మాజీమంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు శుక్రవారం ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. తెలంగాణ సంస్థల ప్రైవేటీకరణను, తెలంగాణ ప్రజల వాటాల విక్రయానికి కేంద్రం పూనుకొన్నా, కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నించినా.. కాంగ్రెస్ నాయకులు, పార్టీ శ్రేణులు అడుగడుగునా వ్యతిరేకించారని వెల్లడించారు. కేసీఆర్ సీఎం ఉన్నప్పుడే కేంద్రం సింగరేణి గనులను తొలిసారి వేలం వేసిందని, రెండు ప్రైవేటు కంపెనీలకు అప్పగించిందని అన్నారు. అప్పుడే అరబిందో, అవంతిక కంపెనీలకు కట్టబెట్టిందని చెప్పారు. అప్పుడు బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడలేదు? అని కేటీఆర్‌ను ప్రశ్నించారు. సింగరేణి గనులను ప్రైవేటీకరించడం, వేలం వేయడాన్ని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార వ్యతిరేకించారని తెలిపారు. అవంతిక, అరబిందో కంపెనీలకు అప్పగించిన బొగ్గు బ్లాకులను రద్దు చేసి తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారని వెల్లడించారు. ఈ మేరకు భట్టి విక్రమార్క రాసిన లేఖను జత చేశారు. ‘తెలంగాణ ప్రజల ప్ర యోజనాలు, ఆస్తులు, హకులను కాపాడేది కాంగ్రెస్ ఒకటే. తెలంగాణ భవిష్యత్తు కాంగ్రెస్‌తో సురక్షితం. మన బొగ్గు.. మన హకు. కాపాడి తీరుతాం. ప్రజల ప్రతి హకు కోసం పోరాడుతాం’ అని పేర్కొన్నారు.