హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): పంచాయతీ ఉద్యోగుల వేతనాలను ఇక నుంచి గ్రీన్‌చానల్‌లో చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులు సీతక్క, సురేఖ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీఎస్ శాంతికుమారి, మాజీ మంత్రి జానారెడ్డి, ఎంపీ రఘువీర్‌రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియాతో కలిసి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. సీఎం మాట్లాడుతూ.. ఉపాధి హామీ, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా నిధులు రాబట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ) : పోలీసుశాఖ, మినిస్ట్రియల్ స్టాఫ్ ఉద్యోగుల స్పౌజ్ బదిలీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. క్యాబినెట్ సబ్‌కమిటీ ఇచ్చిన నివేదికలకు గురువారం ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో భార్యభర్తలు ఒకే జిల్లాలో పనిచేయాలని ఎదురుచూస్తున్న వారి ఆశలు ఫలించాయి. అన్ని మల్టీజోన్-1 పరిధిలోని 317 జీవో కింద దరఖాస్తు చేసుకున్న వారికి బదిలీలు చేస్తూ.. ఉత్తర్వులు ఇచ్చారు.