హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ఆదాయ వనరుగా మార్చాలని సీఎం రే వంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ప ర్యాటకం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో శుక్రవారం పర్యాటక, విద్యారంగాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. సెమీ అర్బ న్, గ్రామీణ ప్రాంతాల్లో పర్యాటక రంగం లో పెట్టుబడులు పెట్టేవారికి ప్రోత్సాహాకా లు కల్పించాలని చెప్పారు. పది రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో చేపట్టే నిర్మాణాలు యూనివర్సిటీల స్థాయిలోనే ఉండాలని సూచించారు.