Davos WEF | దావోస్‌లో ఎంవోయూలు.. రాష్ట్రంలో 37,600 కోట్ల పెట్టుబడికి 6 కంపెనీల సంసిద్ధత
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దావోస్ పర్యటన సందర్భంగా బుధవారం పలు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందాలు (ఎంవోయూ) కుదుర్చుకొన్నాయి. అదానీ గ్రూప్‌సహా ఆరు కంపెనీలు మొత్తం రూ.37,600 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చాయి.
- రాష్ట్ర ప్రభుత్వంతో పలు సంస్థల ఒప్పందాలు
- స్కిల్ వర్సిటీ ఏర్పాటు చేస్తామన్న అదానీ గ్రూప్
Davos WEF | హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దావోస్ పర్యటన సందర్భంగా బుధవారం పలు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందాలు (ఎంవోయూ) కుదుర్చుకొన్నాయి. అదానీ గ్రూప్‌సహా ఆరు కంపెనీలు మొత్తం రూ.37,600 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చాయి.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు జరుగుతున్న విషయం విదితమే. సీఎం నేతృత్వంలోని బృందం రాష్ర్టానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ సమావేశాల్లో కృషిచేస్తున్నది.
- అదానీ గ్రూప్ రాష్ట్రంలో వివిధ రంగాల్లో రూ.12,400 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. సీఎం రేవంత్‌తో అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ సమావేశమైన అనంతరం రూ.12,400 కోట్ల పెట్టుబడులకు సంబంధించి గౌతమ్ అదానీ, ఏరోస్పేస్, డిఫెన్స్ సీఈవో ఆశిష్‌రాజ్ వంశీ అవగాహనా ఒప్పందాలపై సంతకాలు చేశారు. తెలంగాణలో పెట్టుబడులతోపాటు సిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు గౌతం అదానీ సంసిద్ధత వ్యక్తపరిచారు. త్వరలోనే అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ సిల్లింగ్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని, పూర్తి వివరాలను త్వరలో ప్రకటిస్తామని అదానీ తెలిపారు.
- జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ అనుబంధ సంస్థ జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ తెలంగాణలో రూ.9,000 కోట్ల పెట్టుబడితో 1,500 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యంగల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఆ సంస్థ ఈ అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది. సీఎం రేవంత్‌తో జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ సమావేశమైన అనంతరం ఈ మేరకు ఒప్పందం చేసుకున్నారు.
- తెలంగాణలో ఔషధాల ఆవిషరణ, అభివృద్ధి సేవలను విస్తరించేందుకు ఆరాజెన్ లైఫ్ సైన్సెస్ సంసిద్ధత వ్యక్తంచేసింది. ఇందులో భాగంగా రూ.2,000 కోట్ల కొత్త పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొన్నది.
- గోడి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తెలంగాణలో రూ.8,000 కోట్ల పెట్టుబడితో ఆర్ అండ్ డీతోపాటు గిగా సేల్ బ్యాటరీ సెల్ తయారీ కేంద్రాన్ని నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నది. సీఎం రేవంత్‌తో గోడి ఇండియా కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో మహేష్ గోడి సమావేశమయ్యారు.
- తెలంగాణలో రూ.5,200 కోట్లతో డాటా సెంటర్లను నెలకొల్పేందుకు వెబ్‌వర్స్ ముందుకొచ్చింది. డాటా సెంటర్ల నిర్వహణలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన ఐరన్ మౌంటేన్ అనుబంధ సంస్థ వెబ్‌వర్స్. ఐ రన్ మౌంటేన్ సీఈవో విలియం మీనీ, వెబ్‌వర్స్ సీఈవో నిఖిల్ రాఠీ.. సీఎం రేవంత్ తో సమావేశమై తెలంగాణలో డాటా సెంట ర్ల ఏర్పాటు, నిర్వహణపై చర్చలు జరిపారు.
- సీఎం రేవంత్‌రెడ్డితో గోద్రెజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ నాదిర్ గోద్రె జ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో రూ.1,000 కోట్లతో కెమికల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
సీఎం రేవంత్‌తో సీఐఐ ప్రతినిధుల భేటీ
భారత పరిశ్రమల సమాఖ్య తెలంగాణ విభాగం ఆధ్వర్యంలో బుధవారం పలు కంపెనీలకు చెందిన సీఈవోలు దావోస్‌లో సీఎం రేవంత్‌రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ర్టానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు వారు చేస్తున్న కృషిని అభినందించారు. రాష్ర్టాభివృద్ధికి తమవంతు సహకారం అందిస్తామని సీఎంకు భరోసా ఇచ్చారు. సీఐఐ చైర్మన్ శేఖర్‌రెడ్డితోపాటు వివిధ కంపెనీల సీఈవోలు సీఎంను కలిసినవారిలో ఉన్నారు.
కంపెనీల పెట్టుబడి ఎంవోయూల వివరాలు
సంస్థ : పెట్టుబడి ఒప్పందం (రూ.కోట్లలో)
అదానీ గ్రూప్ : 12,400
ఆరాజెన్ : 2,000
జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ : 9,000
గోడి ఇండియా : 8,000
వెబ్ వర్క్స్ : 5,200
గోద్రెజ్ : 1,000
నాడు ఆరోపణలు.. నేడు ఒప్పందాలు
- అదానీపై దుమ్మెత్తిపోసిన రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి
- ఇప్పుడు దావోస్‌లో అదే అదానీతో ఒప్పందాలు
- సోషల్ మీడియాలో పేలుతున్న సెటైర్లు

‘ఇద్దరు గుజరాతీలు దేశాన్ని అమ్ముతుంటే..మరో ఇద్దరు గుజరాతీలు కొంటున్నారు, ప్రధాని మోదీ దేశ సంపదను అదానీకి దోచి పెడుతున్నారు’.. ఇవీ ప్రముఖ వ్యాపారవేత్త అదానీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు. సీఎం రేవంత్‌రెడ్డి కూడా గతంలో అదానీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్‌రెడ్డి అదానీకి రెడ్ కార్పొరేట్ వేశారు.
దావోస్‌లో జరుగుతున్న వ్యాపార సదస్సులో అదానీతో భేటీ అయిన సీఎం రేవంత్ పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వారిద్దరి భేటీపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ‘అప్పుడేమో మీ అగ్రనేతతో పాటు మీరు అదానీపై ఆరోపణలు చేస్తరు.. ఇప్పుడేమో ఒప్పందాలు చేసుకుంటారా?’ అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా అదానీపై రాహుల్‌గాంధీ ఆరోపణలు అపాలని డిమాండ్ చేస్తున్నారు. మరికొందరేమో రాజకీయం వేరు.. పరిపాలన వేరు అని సమర్థిస్తున్నారు. ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా రాహుల్‌గాంధీ అదే అదానీతో ఒప్పందాలు చేసుకుంటారని సెటైర్లు వేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

