CM Revanth Reddy | హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 30 (నమస్తే తెలంగాణ): కరెంటు పోవద్దని మధ్యాహ్నమే అధికారులకు ఆదేశం..! సాయంత్రమే కేకేతో భేటీ సందర్భంగా మూడు సార్లు కరెంటు కట్..! ఇదీ శనివారం సీఎం రేవంత్‌కు ఎదురైన చేదు అనుభవం. శనివారం విద్యుత్తుపై సమీక్ష చేపట్టిన సీఎం.. రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ పెరిగిందని, నిమిషం కూడా కరెంట్ పోవద్దని అధికారులను ఆదేశించారు.
సాయంత్రం బంజారాహిల్స్ రోడ్ నంబరు 12లోని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎంపీ కేకే నివాసంలో భేటీ సందర్భంగా మూడు సార్లు కరెంటు పోయింది. ఏకంగా సీఎం హాజరైన సమావేశంలో కరెంటు పోవటంపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు హతాశులయ్యారు. ఆగమేఘాల మీద వచ్చిన ఎస్పీడీసీఎల్ అధికారులు కరెంటును పునరుద్ధరించేందుకు ఆపసోపాలు పడ్డారు. దీంతో ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.