హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని తెలంగాణ క్యాడర్‌కు చెందిన 2024 బ్యాచ్ ట్రైనీ ఐఏఎస్‌లు బుధవారం కలిశారు. ఎంసీఆర్ హెచ్చార్డీ వైస్ చైర్పర్సన్ శాంతికుమారి, కోర్సు డైరెక్టర్ ఉషారాణి ఆధ్వర్యంలో ఎంసీఆర్‌హెచ్చార్డీలో శిక్షణ పొందుతున్న ఐఏఎస్ అధికారులు సౌరభ్ శర్మ, సలోని చాబ్రా, హర్షచౌదరి, కరోలిన్ చింగ్తియన్మయి, కొయ్యడ ప్రణయ్‌కుమార్ ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ట్రైనీ ఐఏఎస్‌లను ఆయన అభినందించారు.