హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో భేటీ అయ్యారు. ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే వివరాలను ఆయన గవర్నర్‌కు వివరించారు. 2025లో కేంద్రం చేపట్టే జనగణనకు ఈ సర్వేను పరిగణనలోకి తీసుకునే అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.
అనంతరం తన సోదరుడి కుమార్తె వివాహానికి హాజరు కావాలని గవర్నర్‌ను ఆహ్వానించారు. రేవంత్ వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీలు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, బలరాంనాయక్, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్‌రెడ్డి, షబ్బీర్ అలీ, కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి తదితరులు ఉన్నారు.