హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. శనివారం సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొంటారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలతోనూ సమావేశం అవుతారు. మంత్రివర్గ ప్రక్షాళన, నామినేటెడ్ పోస్టుల భర్తీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై చర్చించే అవకాశముంది. రేవంత్ సీఎం అయ్యాక ఢిల్లీకి వెళ్లడం ఇది 62వసారి.
హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం యత్నిస్తున్నదని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ విమర్శించారు. ఇందుకు నిరసనగా 28న అన్ని గ్రామాల్లో గాంధీ చిత్రపటాలతో నిరసన తెలుపాలని శ్రేణులకు సూచించారు.