హైదరాబాద్ : లగచర్ల (Lagacharla) రైతు హీర్యా నాయక్ ను చికిత్స కోసం బేడీలతో సంగారెడ్డి ఆసుపత్రికి తీసుకెళ్లడంపై సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సీరియస్ అయ్యారు.ఘటనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.రైతుకు బేడీలు వేసి తీసుకెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చిందని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఘటనపై విచారణ (Investigation) జరిపి పూర్తి నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.ప్రజా ప్రభుత్వం ఇలాంటి చర్యలను సహించదని ఆయన పేర్కొన్నారు.
ఫార్మాసిటీకి తమ భూములు ఇవ్వబోమని ఆందోళన చేపట్టిన రైతులపై కేసు నమోదు చేసిన పోలీసులు మరోసారి దారుణానికి పాల్పడ్డారు. అధికారులపై దాడులకు పాల్పడ్డరాన్న నెపంతో లగచర్లకు(Lagacharla ) చెందిన రైతు హీర్యానాయక్(Heeryanaik)తో పాటు మరో 20 మందిని అరెస్టు చేసి జైలులో ఉంచి విషయం తెలిసిందే.
హీర్యానాయక్‌కు గురువారం గుండె సమస్యరావడంతో అతడికి సంకెళ్ళ తోనే (Hand Cuffs) జైలు సిబ్బంది సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి 2డీ ఈకో పరీక్షలు నిర్వహించారు. అండర్ ట్రయల్ ఖైదీలకు సంకెళ్లు వేసి తీసుకురావడం భావ్యంకాదని గతంలో కోర్టులు తీర్పు చెప్పినా కూడా జైలు సిబ్బంది సంకెళ్లుతో తీసుకురావడం రాష్ట్రవ్యాప్తంగా చర్చాంశానీయంగా మారింది.