హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా, దక్షిణకొరియా పర్యటన శనివారం తెల్లవారుజామున ప్రారంభమైంది. ఆయన వెంట ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, సీఎం వ్యక్తిగత సిబ్బంది వెళ్లారు. ఉదయం 4:35 గంటలకు శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరారు. ఈనెల 10వ తేదీ వరకు అమెరికాలో, 11నుంచి దక్షిణకొరియాలో పర్యటిస్తారు. తిరిగి 14న ఉదయం హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.