Chilkur Balaji Temple | మొయినాబాద్, ఫిబ్రవరి10: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్‌పై జరిగిన దాడిపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం సాయంత్రం స్పందించారు. దాడికి పాల్పడిన వ్యక్తులు ఎంతటి వారైనా చట్టపరంగా శిక్షిస్తామని తెలిపారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచించారు. ఈ మేరకు ఆలయ అర్చకులు రంగరాజన్‌తో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు.
చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు రంగరాజన్‌పై జరిగిన దాడి గురించి తెలుసుకుని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య సోమవారం ఆయన్ను పరామర్శించారు. దాడికి గల కారణాలను తెలుసుకున్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి దాడి వివరాలను వెల్లడించారు. అనంతరం రంగరాజన్‌తో మాట్లాడించారు. ఫోన్ మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డి దాడి ఘటనకు సంబంధించి వివరాలను తెలుసుకున్నారు. ఇంత జరిగిన ఎందుకు తమ దృష్టికి తీసుకురాలేదని, ఏదైనా ఉంటే స్థానిక ఎమ్మెల్యే యాదయ్య దృష్టికి తీసుకెళ్లాని సూచించారు. ఇలాంటి దాడి జరగడం దురదృష్టకరమని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాంటి చర్యల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని.. దాడికి పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ కమిషనర్‌ను ఆదేశించడం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తమ పూర్తి భద్రత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. దాడి విషయం తెలుసుకుని ఫోన్లో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని దాడి విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే అప్రమత్తమై దాడికి పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవడం ప్రారంభించారని అర్చకులు రంగరాజన్ ముఖ్యమంత్రికి తెలిపారు.
“ఏంటి అయ్యగారు మీ మీద ఇంత దాడి జరిగితే నాకు చెప్పి పంపలేదు” అని రంగరాజన్‌కు ఫోన్ చేసి అడిగిన సీఎం రేవంత్ రెడ్డి https://t.co/x6zDDk7OWV pic.twitter.com/sxmiZsUuWk
— Telugu Scribe (@TeluguScribe) February 10, 2025