హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో డ్రగ్స్ బాధితుల కోసం ప్రత్యేక డీ-అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఎంసీఆర్హెచ్ఆర్డీ బోధి పెవిలియన్‌లో పోలీస్ ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు. సైబర్ క్రైమ్ నియంత్రణపై స మగ్ర నివేదిక రూపొందించాలని చెప్పా రు. ఫోరెన్సిక్ సెంటర్స్, డాటా సెంటర్ల ను పెంచుకోవాలని తెలిపారు. ట్రైనింగ్‌లోనే సైబర్‌క్రైమ్‌లో పనిచేయడం కోసం సెలక్షన్ జరగాలని సూచించారు. విజిలెన్స్ విభాగంలో సాంకేతికతను పెంచాలని, ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే వారిపై విజిలెన్స్ ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. విజిలెన్స్‌కు మరిన్ని అధికారాలు ఇచ్చే అంశంపై అధ్యయనం చే యాలని సూచించారు. అగ్ని ప్రమాదాల నివారణకు ఫైర్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవాలని తెలిపారు. మున్సిపల్ శాఖ హైడ్రాతో సమన్వయం చేసుకుని అ గ్నిమాపక శాఖపై వచ్చే నెల 15లోగా నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు. నాలాల మెయింటెనెన్స్‌లో మెట్రో వా టర్ వర్క్స్ విభాగంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. నగరంలో ఫ్లెక్సీలపై నియంత్రణ ఉండాల్సిందేనని తెలిపారు. రాత్రిపూట పెట్రోలింగ్‌ను పెంచాలని అధికారులను ఆదేశించారు.