హైదరాబాద్ : దూరదర్శన్(Doordarshan) న్యూస్ రీడర్ శాంతి స్వరూప్(Shanti Swaroop) మృతిపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సంతాపం(Condoles) ప్రకటించారు. తొలితరం తెలుగు న్యూస్ రీడర్ శాంతిస్వరూప్ మరణం బాధాకరమన్నారు. మీడియా రంగంలో ఆయన తనదైన ముద్ర వేశారని గుర్తు చేశారు. శాంతిస్వరూప్ కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
కాగా, రెండు రోజుల క్రితం గుండెపోటుకు గురైన శాంతి స్వరూప్.. హైదరాబాద్ యశోదా హాస్పిటల్లో చికిత్స పొందుతూ శుక్రవరం ఉదయం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. 1983 నవంబర్ 14న దూరర్శన్లో చానెల్లో ఆయన తెలుగులో తొలిసారి వార్తలు చదివారు. పదేండ్ల పాటు టెలీప్రాంటర్ లేకుండా పేపర్ చూసి వార్తలు ప్రజలకు వినిపించారు. తొలి తెలుగు న్యూస్ రీడర్‌గా చెరగని ముద్ర వేశారు. శాంతిస్వరూప్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.