హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): ప్రధాని నరేంద్రమోదీని బండకేసి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని సీఎం రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. మేడ్చల్‌లో శనివారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో 400 సీట్లు వస్తాయంటూ గొప్పలు చెప్పుకొంటున్న మోదీ.. ఆయా రాష్ర్టాల్లో పొత్తులు ఎందుకు పెట్టుకుంటున్నారని ప్రశ్నించారు.
అప్పుడు అక్రమ కేసులు పెట్టి.. ఇప్పుడు వారినే పొత్తుల కోసం ఎందుకు అడుక్కుంటున్నారని నిలదీశారు. ఇన్ని పొత్తులు పెట్టుకుంటున్న ఎన్డీయే అతుకుల బొంత కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాదంటున్నారని, 2004కు ముందు కూడా ఇలాగే అన్నారని, కానీ ఆ తరువాత రెండుసార్లు అధికారంలోకి వచ్చిందని గుర్తుచేశారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుందని చెప్పారు. బీజేపీకి ఓటెందుకు వేయాలని అడిగారు.
రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని, ఇండ్లు కట్టిస్తానని, రూ.15 లక్షలు అకౌంట్లో వేస్తానని మోదీ ఎన్నో హామీలు ఇచ్చారని, ఏ ఒక్కటీ నెరవేర్చలేదని విమర్శించారు. మల్కాజ్గిరి మేడ్చల్‌లో కాంగ్రెస్‌కు ఎమ్మెల్యేలు లేరని, ఇప్పుడు ఎంపీ కూడా లేకుంటే అభివృద్ధి జరగదని చెప్పారు. అందుకే మల్కాజిగిరి లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్‌కు ఓటేసి గెలిపించాలని కోరారు. మేడ్చల్ అభివృద్ధి చెందాలన్నా… ఐటీ కంపెనీలు రావాలన్నా కాంగ్రెస్ గెలవాల్సిందే అని అన్నారు.
ఈటల ఓటెట్ల అడుగుతడు…
మేడ్చల్ పక్కన ఫాంహౌజ్ కట్టుకుని ఉంటున్న ఈటల రాజేందర్ ఏనాడైనా మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజల బాగోగులు చూశాడా అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఏనాడూ మేడ్చల్, మల్కాజిగిరి ప్రజల బాగోగులు చూడని ఈటల ఇప్పుడు సిగ్గు లేకుండా ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టే మొగోడు ఉన్నడా అని ప్రశ్నించారు. సంతలో పశువులను కొన్నట్టు ఎమ్మెల్యేలను కొనాలని చూస్తున్నారని, ఆ పప్పులు ఏమీ ఉడకవని అన్నారు. ఎవరైనా అటువంటి ప్రయత్నం చేస్తే వారిని ప్రజలు సామాజిక బహిష్కరణ చేస్తారని చెప్పారు.
ఇక 90 రోజుల్లో 30 వేల ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగులకు కాంగ్రెస్ అండగా నిలబడిందని అన్నారు. ఉద్యోగాల్లో మహిళలకు అన్యాయం చేశారంటూ ఎమ్మెల్సీ కవిత ఆరోపిస్తున్నారని, కానీ 43 శాతం కొలువులు అమ్మాయిలకే ఇచ్చినట్టు తెలిపారు. కాంగ్రెస్ పార్టీపై నెపం నెట్టడానికే మేడిగడ్డను తొందరగా రిపేర్ చేయాలని మాజీ సీఎం కేసీఆర్ డిమాండ్ చేస్తున్నారని అన్నారు. ఢిల్లీ నుంచి అధికారులు వచ్చారని, వాళ్లు పరిశీలించి రిపేర్ చేయాలని చెప్తే చేస్తామని తెలిపారు. లేదా ప్రాజెక్టును మొత్తం మళ్లీ కట్టాల్సి వస్తుందా అనేది అధికారులు సూచిస్తారని చెప్పారు.
అధునాతన నైపుణ్య శిక్షణకు ఒప్పందం
Tata Technologies Meet
హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): టాటా గ్రూప్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 65 ఐటీఐ కాలేజీల్లో అధునాతన సాంకేతిక నైపుణ్య శిక్షణ కేంద్రాలు (స్కిల్లింగ్ సెంటర్లు) ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు టాటా గ్రూప్ ప్రతినిధులు శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందంలో భాగంగా టాటా గ్రూప్ ప్రభుత్వ భాగస్వామ్యంతో రాష్ట్రంలోని ఐటీఐలను అడ్వా న్స్ టెక్నాలజీ సెంటర్లుగా అప్‌గ్రేడ్ చేయనున్నది.
9 లాంగ్ టర్మ్, 23 షార్ట్ టర్మ్ కోర్సులతోపాటు పలు బ్రిడ్జి కోర్సులను నిర్వహించనున్నారు. 2024-25 విద్యా సంవత్సరం నుంచే ఈ ప్రాజెక్టును అమ లు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.2700 కోట్ల ఖర్చుతో ఐటీఐల్లో ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నది. అవసరమైన వర్షాప్ల నిర్మాణం, యంత్రాలు, పరికరాలతోపాటు శిక్షణ అందించే ట్యూటర్ల నియామకాన్ని టాటా టెక్నాలజీస్ చేపడుతుంది. ఏటా 9000 మందికి అడ్మిషన్లు కల్పిస్తారు.
దాదాపు లక్ష మందికి షార్ట్ టర్మ్ కోర్సుల్లో శిక్షణ ఇస్తారు. వివిధ రంగాల్లో పారిశ్రామిక అవసరాలకు, ప్రస్తుత కోర్సులకు మధ్య ఉన్న భారీ అంతరాన్ని తగ్గించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టినట్టు సీఎం ఈ సందర్భంగా చెప్పారు. అక్టోబర్ నుంచి మొదలయ్యే అకడమిక్ సెషన్‌కు వర్క్ ఆప్షన్లను అందుబాటులో ఉంచాలని, ట్యూటర్లను నియమించాలని టాటా టెక్నాలజీ ప్రతినిధులకు సీఎం సూచించారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార, ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను సిల్ డెవెలప్మెంట్ హబ్‌గా తీర్చిదిద్దుతామని చెప్పారు. రాష్ట్రంలో సిల్ యూనివర్సిటీని నెలకొల్పనున్నామని తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఉపాధి శిక్షణశాఖ స్పెషల్ సీఎస్ రాణి కుముదిని, టాటా టెక్నాలజీస్ ప్రెసిడెంట్ పవన్ బగేరియా పాల్గొన్నారు.