హిమాయత్‌నగర్, డిసెంబర్ 22: ప్రధాని మోదీ డైరెక్షన్లోనే సీఎం రేవంత్‌రెడ్డి నడుస్తున్నారని మాలమహానాడు అధ్యక్షుడు పబ్బతి శ్రీకృష్ణ వ్యాఖ్యానించారు. మాల మహానాడు వ్యవస్థాపకుడు పీవీ రావు వర్ధంతి సందర్భంగా ఆదివారం హైదర్‌గూడలోని ఎన్ఎస్ఎస్లో పీవీ రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతి ప్రయోజనాల కోసం ఉన్నత ఉద్యోగాన్ని వదిలి ప్రాణాలు సైతం లెక్కయచేయకుండా పోరాడి అసువులుబాసిన గొప్ప వ్యక్తి పీవీ రావు అని కొనియాడారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అనుచిత వ్యాఖ్యలను రేవంత్‌రెడ్డి ఖండించకపోవటం దురదృష్టకరమని పేర్కొన్నారు. మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి బిళ్లం మహేందర్, నాయకులు డాక్టర్ ప్రేమ్‌కుమార్, యాదయ్య పాల్గొన్నారు.