అక్టోబర్‌లో భూసేకరణ పూర్తిచేయాలి
రీజనల్ రింగ్‌రోడ్డు (ట్రిపుల్ఆర్) ఉత్తర, దక్షిణ భాగాలతోపాటు రేడియల్ రోడ్ల నిర్మాణానికి అక్టోబర్ చివరిలోగా భూసేకరణ పూర్తిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కోర్టు పరిధిలో ఉన్న భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.
- కోర్టు కేసుల పరిష్కారానికి చర్యలు చేపట్టండి
- ట్రిపుల్‌ఆర్‌పై సమీక్షలో కలెక్టర్లకు సీఎం ఆదేశం
హైదరాబాద్, సెప్టెంబర్ 22(నమస్తే తెలంగాణ): రీజనల్ రింగ్‌రోడ్డు (ట్రిపుల్ఆర్) ఉత్తర, దక్షిణ భాగాలతోపాటు రేడియల్ రోడ్ల నిర్మాణానికి అక్టోబర్ చివరిలోగా భూసేకరణ పూర్తిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కోర్టు పరిధిలో ఉన్న భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలోని జాతీయ రహదారుల ప్రాథికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) ప్రాజెక్టులపై సీఎం సోమవారం సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.
వివిధ జిల్లాలకు చెందిన కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, జిల్లాల్లో పెండింగ్‌లో ఉన్న భూసేకరణ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని, భూములు కోల్పోయిన రైతులకు వెంటనే పరిహారం అందించాలని కలెక్టర్లను ఆదేశించారు.
ట్రిపుల్ఆర్ ఉత్తర, దక్షిణ భాగాలతో పాటు రేడియల్ రోడ్ల నిర్మాణంపై అధికారులకు పలు సూచనలు చేశారు. హైదరాబాద్ నుంచి బందరు పోర్టు వరకు గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం అంశంపై మాట్లాడుతూ, వీలైనంత త్వరగా రూట్‌మ్యాప్‌పై తుది నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అలాగే, హైదరాబాద్- శ్రీశైలం హైవేలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్రం నుంచి వీలైనంత త్వరగా అనుమతులు తీసుకోవాలని చెప్పారు. ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు తదితరులు సమీక్షలో పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Kubheer | భూముల రీసర్వే పనులు పారదర్శకంగా నిర్వహించాలి : సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్ కుమార్
Green Crackers: ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ కాల్చుకోవచ్చు: సుప్రీంకోర్టు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం తథ్యం : రేగా కాంతారావు
Maulana Shahabuddin Razvi: షరియత్ ప్రకారం సీఎం ఒమర్ పెళ్లి చల్లదు: జమాత్ చీఫ్
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

