చెన్నై: తమిళనాడులో సీఎం కేసీఆర్ పర్యటన మూడో రోజుకు చేరింది. ఈరోజు ఆయన మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధినేత, నటుడు కమల్ హాసన్ భేటీ అవనున్నారని సమాచారం. బుధవారం నాడు సీఎం కేసీఆర్.. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌తో సమావేశమైన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే ఈరోజు కమల్ హాసన్‌తో చర్చలు జరపనున్నారని తెలుస్తోంది. అనంతరం మధ్యాహ్నానికి హైదరాబాద్ చేరుకుంటారు. ప్రత్యేక విమానంలో చెన్నై నుంచి హైదరాబాద్ చేరుకుంటారు.