హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా.. విద్యనేర్పే గురువులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. చదువుతోపాటు సంసారాన్ని నేర్పుతూ, రేపటి పౌరులు గా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే గురుతర బాధ్యతను ఉపాధ్యాయులు నిర్వర్తిస్తున్నారని ప్రశంసించారు. ‘సమాజాభివృద్ధికి విద్యయే మూలం’ అనే మహనీయుల స్ఫూర్తితో ప్రభుత్వం అందిస్తున్న గురుకుల విద్య దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల సంక్షేమం, విద్యాభివృద్ధికోసం ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణ సత్ఫలితాలను ఇస్తున్నదని పేర్కొన్నారు.
మంత్రి సబిత శుభాకాంక్షలు
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.