హన్వాడ, జూన్ 4 : సహజంగా అభిమానం ఉం టే సంబంధిత వ్యక్తుల బ్యానర్లు, వాళ్ల పేరున అన్నదానం, అనాథలకు ఆర్థికసాయం చేస్తుంటారు. కానీ ఓ బీఆర్ఎస్ కార్యకర్త తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. హన్వాడ గ్రామానికి చెందిన బుచ్చయ్య తన గుండెపై సీఎం కేసీఆర్, ఎక్సైజ్ శాఖ మం త్రి శ్రీనివాస్‌గౌడ్ ఫొటోలను పచ్చబొట్టు వేయించుకున్నాడు. ప్రత్యేక రాష్ట్రం సాధించిన సీఎం కేసీఆర్, మండలాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తూ.. ఎవరికి ఆపద వచ్చినా ముందుడి సహాయం చేస్తున్నందుకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఫొటోను వేసుకున్నానని ఆ యన తెలిపారు. విషయం తెలుసుకున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్ జిల్లాకేంద్రంలో బుచ్చయ్యను ఆదివారం అభినందించారు.