శ్రీనివాస్‌గౌడ్‌కు పీఆర్టీయూ మద్దతు
ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలకు బీఆర్ఎస్ సర్కా రు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. శనివారం రాత్రి మహబూబ్‌నగర్ జిల్లా కేం ద్రంలోని శిల్పారామంలో ఏర్పాటు చేసిన పీఆర్టీయూ ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
- ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సర్కారు అండగా ఉంటాం: శ్రీనివాస్‌గౌడ్
పాలమూరు, అక్టోబర్ 7: ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలకు బీఆర్ఎస్ సర్కా రు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. శనివారం రాత్రి మహబూబ్‌నగర్ జిల్లా కేం ద్రంలోని శిల్పారామంలో ఏర్పాటు చేసిన పీఆర్టీయూ ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా మంత్రిని సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. రాబోయే ఎన్నికల్లో శ్రీనివాస్‌గౌడ్‌ను మరోసారి అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమలాకర్, నాయకులు స్పష్టం చేశారు. ఆయనకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పీఆర్టీయూ నాయకుడి కుమారునిగా, ఉద్యోగ సంఘాలు, ఉద్యమ నేతగా.. ఉద్యోగ, ఉపాధ్యాయులపై ప్రత్యేక అభిమానంతో పనిచేస్తానని తెలిపారు. వారికి ప్రభుత్వం, తాను వెన్నంటే ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెన్నకేశవరెడ్డి, జిల్లా అధ్యక్షుడు నారాయణగౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురాంరెడ్డి, జిల్లా గౌరవ అధ్యక్షుడు గోపాల్ నాయక్, యూనియన్ నాయకులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

