ఆదాయ వనరులు లేని అర్చకులతో పాటు వేద పండితులను ఆదుకున్నది కేసీఆరేనని మల్కాజిగిరిలోని ఆనంద్‌బాగ్ శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామి దేవస్థానం అర్చకుడు ముడుంబై వేంకటేశ్వరాచార్యులు అన్నారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో రాష్ట్రంలోని ధూప దీప నైవేద్యం కోసం ఆలయాలకు నిధులిస్తున్నారని చెప్పారు. అర్చకులకు గౌరవ వేతనాన్ని కల్పించారని గుర్తు చేశారు. దైవ సేవలో ఉన్న పురోహిత కుటుంబాలకు భరోసా ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనన్నారు.
తెలంగాణ రాక ముందు సంఘంలో పేరు మర్యాదలు ఉన్నా కూడా సరైన ఆదాయ వనరులు లేక అర్చకుల పరిస్థితి కడు దయనీయంగా ఉండేది. కుటుంబ పరిస్థితులు, పిల్లల చదువులు, పాఠశాలల ఫీజులు, చివరికి వివాహం చేయాలన్నా కూడా సంబంధాలు వచ్చేవి కాదని.. అలాంటి పరిస్థితుల్లో కుటుంబాన్ని గడిపేవారమన్నారు.
గౌరవ వేతనం రూ.10 వేలు..
స్వరాష్ట్రం సిద్ధించాక ప్రతినెలా పురోహితులకు గౌరవ వేతనంగా రూ.10 వేలు అందజేస్తూ ఆర్థిక సమస్యలను దూరం చేశారు. వారి కుటుంబాల్లోని బతుకులకు భరోసా ఇచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. మా కుటుంబాలపై ఆయనకున్న చిత్తశుద్ధికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు.
భగవంతుడి స్వరూపమే..
స్వయానా కేసీఆర్ రూపంలో భగవంతుడే తమను ఆదుకుంటున్నట్లు భావిస్తున్నామని చెప్పారు. ఎప్పుడైతే మా కుటుంబాలు తృప్తిగా ఉంటాయో అప్పుడే భగవంతుడు సాక్షాత్కరించినట్లు భావించాలి. సమాజంలో అందరూ సంతోషంగా ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. పాలకులంటే కేసీఆర్ లెక్కన ఉండాలన్నారు.
…? బండారు రాజు