CM KCR | మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణానికి చెందిన విద్యార్థిని శ్రీరాముల హరితకు ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిలబెట్టుకున్నారు. జూన్ 9న మంచిర్యాల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించారు.
ఇదే జిల్లా చెన్నూరు నియోజకవర్గ పరిధిలోని మందమర్రి పట్టణానికి చెందిన శ్రీరాముల హరిత.. బీసీ రెసిడెన్షియల్ కళాశాలలో విద్యాభ్యాసం చేశారు. ఇంటర్లో 470 మార్కులకు 468 మార్కులు సాధించిన హరితను సీఎం కేసీఆర్ అభినందించారు.
అంతే కాక, ఆమె ఉన్నత విద్యాభ్యాసానికి రూ.5 లక్షల నగదు సాయం అందిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం కేసీఆర్ పంపిన రూ.5 లక్షల చెక్‌ను శనివారం మంచిర్యాల ఐడీఓసీ కలెక్టరేట్లో విద్యార్థిని హరితకు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అందజేశారు.