హైదరాబాద్ : తమిళనాడులో మూడు రోజుల పాటు పర్యటించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ నెల 13న మధ్యాహ్నం సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా ప్రత్యేక విమానంలో తమిళనాడుకు వెళ్లారు. తిరుచ్చి శ్రీరంగంలోని రంగనాథస్వామిని సీఎం కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న సాయంత్రం తమిళనాడు సీఎం స్టాలిన్‌తో కేసీఆర్ సమావేశమై పలు అంశాలపై చర్చించారు. బుధవారం ఉదయం చెన్నై కావేరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ గవర్నర్ నరసింహన్‌ను సీఎం కేసీఆర్ పరామర్శించారు. అనంతరం చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు వచ్చారు.