మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Telangana - Sep 09, 2020 , 11:19:53

కాళోజీ ప్రజల గొంతుక : సీఎం కేసీఆర్‌

కాళోజీ ప్రజల గొంతుక : సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌ : ప్రజాకవి కాళోజీ నారాయణరావు 106వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నివాళులర్పించారు. ప్రజల గొంతుకగా జీవితాంతం బతికిన కాళోజీ నారాయణరావు ఎప్పటికీ చిరస్మరణీయుడే అని పేర్కొన్నారు. ప్రజల్లో చైతన్యదీప్తి వెలిగించడానికి ఆయన ధైర్యంగా నిలబడే వారు అని సీఎం కేసీఆర్‌ గుర్తు చేశారు.

ర‌వీంద్ర భార‌తిలో ప్ర‌జా క‌వి కాళోజీ నారాయ‌ణ‌రావు జ‌యంతి వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వ‌ర్యంలో ఈ వేడుక‌ల‌ను నిర్వ‌హించారు. కాళోజీ చిత్ర‌ప‌టానికి సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. logo