ముచ్చింతల్లోని చినజీయర్ స్వామి ఆశ్రమానికి సీఎం కేసీఆర్ చేరుకున్నారు. సీఎంకు ఆశ్రమ రుత్వికులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సీఎంతోపాటు మంత్రి హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, సంతోష్ కూడా ఆశ్రమానికి చేరుకున్నారు.
ఇక్కడ చినజీయర్ స్వామిని కలిశారు. ఇద్దరూ కలిసి ఆశ్రమంలోని యాగశాలను పరిశీలించారు. మహాసుదర్శన యాగం ఏర్పాట్లపై చర్చించారు. అలాగే రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ ఏర్పాట్లపై కూడా ముచ్చటించారు. ముచ్చింతల్లో ఫిబ్రవరి నెలలో శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలు జరగనున్నాయి.
వచ్చే నెల 2 నుంచి 14 వరకు ఈ ఉత్సవాలు నిర్వహించనున్నారు. వీటి గురించి కూడా సీఎంతో చినజీయర్ స్వామి మాట్లాడారు. యాదాద్రి పునఃప్రారంభం ఏర్పాట్ల గురించి కూడా చర్చించుకున్నారు.