హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి చేరుకున్నారు. ఉదయం 9:30 గంటలకే అసెంబ్లీకి చేరుకున్న కేసీఆర్.. ఉద్యోగ నియామకాల ప్రకటనపై కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. వివిధ శాఖల అధికారులతో సమావేశమైనట్లు సమాచారం. ఉదయం 10 గంటలకు శాసనసభ వేదికగా సీఎం కేసీఆర్ ఉద్యోగ నియామక నోటిఫికేషన్లపై ప్రకటన చేయనున్నారు. ఈ విషయాన్ని నిన్న వనపర్తి సభలో కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.