హైదరాబాద్ : ప్రగతి భవన్లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి టీఆర్ఎస్ పార్టీకి చెందిన లోక్సభ, రాజ్యసభ సభ్యులు హాజరయ్యారు. ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సి వ్యూహాలపై సీఎం ఎంపీలకు దిశానిర్దేశం చేస్తున్నారు.
పార్లమెంటు ఉభయ సభల్లో అనుసరించాల్సిన విధి విధానాలు, కేంద్రాన్ని నిలదీసే అంశాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలపై పోరాడాలని పిలుపునివ్వనున్నారు. అన్ని రంగాల్లోనూ తెలంగాణకు నష్టం చేసేలా కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై పార్లమెంటు వేదికగా తీవ్ర నిరసన వ్యక్తం చేయాల్సిన తీరుపై ఎంపీలకు దిశా నిర్దేశం చేస్తారు. ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులు, మిల్లర్లను ఇబ్బందులు పెడుతున్న తీరును ఎండగట్టేలా వ్యూహరచన చేస్తున్నారు.