హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): బ్రాహ్మణ సమాజాన్ని ఆదుకుంటున్న ఏకైక ప్రభుత్వం తమదేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. ‘బ్రాహ్మణులను మీరు ఎన్నడూ పట్టించుకున్న పాపాన పోలే. బ్రాహ్మణ సమాజాన్ని ఆదుకుంటున్న ఏకైక రాష్ట్ర ప్రభుత్వం ఈ దేశంలో తెలంగాణ మాత్రమే.
మేం బాజాప్తా.. ప్రతి వర్గం.. ప్రతి వ్యక్తి సంక్షేమం కోసం పాటుపడ్డాం. బ్రాహ్మణ సంక్షేమానికి బడ్జెట్లో నిధులు కేటాయించే ఏకైక దిలేర్.. దమ్మున్న రాష్ట్రం తెలంగాణ. మేం ఓట్ల కోసం భయపడం’ అని సీఎం స్పష్టం చేశారు.