హైదరాబాద్: భారత రాష్ట్రసమితి (BRS) పార్లమెంటరీ పార్టీ, శాసనసభాపక్షంతోపాటు రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం మరికాసేట్లో ప్రారంభంకానున్నది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (CM KCR) అధ్యక్షతన తెలంగాణ భవన్లో (Telangana Bhavan) సమావేశం జరుగనుంది. ఈనేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, కార్పొరేషన్ల చైర్మన్లు, డీసీఎంఎస్, డీసీసీబీ చైర్మన్లు తెలంగాణ భవన్కు చేరుకుంటున్నారు.
ఇది ఎన్నికల సంవత్సరమైన నేపథ్యంలో ప్రజల్లోకి ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరు, పార్టీ కార్యకలాపాలు, తదితర అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు. పార్టీ కార్యాచరణ ఎలా ఉండాలనే విషయాలపై నేతలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.