శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 23, 2020 , 01:29:28

సీఎం కేసీఆర్‌ సైనికుల ఆత్మబంధువు

సీఎం కేసీఆర్‌ సైనికుల ఆత్మబంధువు

టీఆర్‌ఎస్‌ వచ్చాకే మాజీ సైనికులకు సరైన గుర్తింపు 

ఉమ్మడి ఏపీ మాజీ సైనికుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు వసంత్‌కుమార్‌  

మాజీ సైనిక కుటుంబాలను ఏ ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితుల్లో మా గురించి ఆలోచిస్తున్న సీఎం కేసీఆర్‌ అంటే ఎంతో గౌరవం ఉన్నది. డబుల్‌బెడ్‌రూం ఇండ్లు సహా ఇచ్చిన హామీలు త్వరలోనే నెరవేరుస్తారన్న నమ్మకం కూడా ఉంది. ఆ దిశగా వెంటనే చర్యలు తీసుకోవాలని మేం ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న వారికి మేమూ అండగానే ఉంటాం.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దేశం కోసం సేవచేసి ముదిమి వయస్సులో తగిన గౌరవం, సాయం కోసం ఎదురుచూస్తున్న మాజీ సైనికులకు సీఎం కేసీఆర్‌ ఆత్మబంధువులా నిలుస్తున్నారని మాజీ సైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాకే తగిన గుర్తింపు లభించిందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ సైనికుల సంక్షేమ సం ఘం వ్యవస్థాపక అధ్యక్షుడు వసంత్‌కుమార్‌ ‘నమస్తే తెలంగాణ’తో చెప్పారు. దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో ప్రాణాలు కోల్పోయిన అమరుల కుటుంబాలకు ఆర్థికంగా దన్నుగా నిలిచేందుకు పెద్దమొత్తంలో ఆర్థికసాయం అందిస్తూ సీఎం కేసీఆర్‌ పెద్దమనసు చాటుకుంటున్నారని పేర్కొన్నారు. 2017 జనవరి17న అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌కు డబుల్‌బెడ్‌రూం ఇండ్లు ఇస్తామని చేసిన ప్రకటనే మాజీ సైనికులపై ఆయనకు ఉన్న ప్రేమకు నిదర్శనమని పేర్కొన్నారు.  సైనికులకు అండగా ఉండాలన్న మంచి ఉద్దేశంతో మాజీ సైనికుల ఇండ్లకు ప్రాపర్టీ ట్యాక్స్‌ రద్దుచేస్తూ  2017లో సీఎం కేసీఆర్‌ తీసుకు న్న నిర్ణయం తమకు భారీ ఊరటనిచ్చిందని పేర్కొన్నారు. మాజీ సైనికుల సంక్షేమానికి ఉమ్మడి ఏపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన అ న్ని జీవోల అమలుకు సానుకూల నిర్ణయాలు తీసుకోవడం హర్షణీయమని చెప్పారు. ఏం డ్లుగా కోర్టు కేసులతో నానుతున్న మాజీ సైనికులకు భూ పంపిణీ అంశంలోనూ ప్రభు త్వం సానుకూలత వ్యక్తం చేసిందని అన్నారు. అమరులైన సైనికుల కుటుంబాలకు చేయూతనిచ్చేలా రేషన్‌ దుకాణాలు పెట్టుకునేందుకు అవకాశం కల్పిస్తామని ఇప్పటికే హామీ ఇచ్చారని పేర్కొన్నారు. మాజీ సైనికుల సమస్యలపై సీఎం కేసీఆర్‌కు పూర్తి అవగాహన ఉన్నదని వసంత్‌కుమార్‌ వెల్లడించారు. హైదరాబాద్‌లో 50వేల మంది మాజీ సైనిక కుటుంబాలు నివాసం ఉంటున్నాయని.. సీఎం కేసీఆర్‌ నిర్ణయాలు వారికి ఎంతో ఉపశమనం కలిగించాయని అన్నారు.