హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): దేశాన్ని మలుపుతిప్పే శక్తి కేసీఆర్‌కే ఉన్నదని జర్మనీలోని ఎన్నారైలు పేర్కొన్నారు. సుదీర్ఘ పోరాటం తరువాత రాష్ర్టాన్ని సాధించి.. తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని తెలిపారు. విస్తృతమైన సహజ, మానవ వనరులున్న దేశాన్ని మోదీ నేతృత్వంలోని బీజేపీ కేంద్ర సర్కార్ సద్వినియోగం చేసుకోకపోగా, వాటిని ఒకరిద్దరి కోసం తాకట్టుపెడుతున్నారని మండిపడ్డారు. బీజేపీని ఎదుర్కొనే శక్తి కేసీఆర్‌కే ఉన్నదని చెప్పారు. కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడని, ఆయన నాయకత్వంలో భారత్ అద్భుత ప్రగతి సాధిస్తుందని పేర్కొన్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడం ద్వారానే భారత్ ప్రపంచ దేశాల ముందు తన సత్తాను నిరూపించుకోగలదని తేల్చిచెప్పారు.
దిశానిర్దేశం చేయగల నేత
దేశానికి దిశానిర్దేశం చేయగల నాయకుడు సీఎం కేసీఆర్ ఒక్కరే. కాంగ్రెస్, బీజేపీలు దేశాన్ని సరైన క్రమం లో నడపలేకపోయా యి. ఎనిమిదేండ్ల కాలంలో మోదీ భారత్‌ను 20 ఏండ్లు వెనక్కి నెట్టారు. దేశ సంపదను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారు. నైపుణ్యం ఉన్న ఎంతోమంది విదేశాల బా ట పడుతున్నారు. ఈ పరిస్థితి మారాలంటే దేశానికి విజన్ ఉన్న నాయకుడు రావాలి. ఆ నాయకుడు కేసీఆర్ కావాలి. కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ మంత్రి కేటీఆర్ విదేశీ కంపెనీలను హైదరాబాద్‌కు రప్పించారు.
– చైతన్యరెడ్డి, సీనియర్ మేనేజర్, ఎన్నారై, జర్మనీ
కేసీఆర్‌లాంటి నాయకుడు అవసరం
14 ఏండ్ల సుదీర్ఘ పోరాటం చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన సీఎం కేసీఆర్ లాంటి నాయకుడు దేశానికి ఎంతో అవసరం. తెలంగాణ తరహాలో దేశ వ్యాప్తంగా మార్పు జరగాలంటే, పథకాలు అమలు కావాలంటే కేసీఆర్ ప్రధాని కావాలి. 24 గంటల ఉచిత విద్యుత్తుతో రైతుల బాధలు తీరాయి. జాతీయ స్థాయిలోనూ రైతులతోపాటు పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయి.
– కుమ్మరి శ్రీను, కార్మిక సంఘం నాయకుడు, షాబాద్, రంగారెడ్డి జిల్లా
కేసీఆర్ కార్మికుల సంక్షేమ ప్రదాత
సీఎం కేసీఆర్ కార్మికుల సంక్షేమ ప్రదాత. గతంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా చేసిన అనుభవం ఉండటంతో రాష్ట్రంలో కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్నారు. కేంద్రంలో బీజేపీ అనుసరిస్తున్న ఆర్థిక, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ కార్మికుల అభ్యున్నతికి కేసీఆర్ పాటుపడుతున్నారు. ప్రతి రంగంలోని అసంఘటితరంగ కార్మికులకు పనికి తగిన వేతనాలు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దే. ఇంతటి మంచి వ్యక్తి దేశ రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు అన్ని విధాలుగా మేలు జరుగుతుంది.
– కే గోపాల్, టీఆర్ఎస్కేవీ అధ్యక్షుడు, తాండూరు, వికారాబాద్ జిల్లా
దూరదృష్టి కేసీఆర్‌కే ఉన్నది
తెలంగాణలో జరుగుతున్న ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశానికి అవసరం. పేదరికాన్ని దేశం నుంచి దూరం చేసే నైపుణ్యం, విజన్ కేసీఆర్‌లో ఉన్నది. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే దేశంలో పేదరికం తొలగిపోతుంది. విద్య, వైద్యం, నీరు, కరెంటు వంటి సదుపాయాలు ప్రతి ఒక పేదవాడికి దక్కాలంటే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి. అనుభవం, వ్యూహం ఉన్న నేత కేసీఆర్ అని దేశం గుర్తించింది.
– కమల్ కాకుమాను, ఇన్ఫోటెయిన్మెంట్ ఇంజినీర్, జర్మనీ
దేశం గర్వించే నాయకుడు
తెలంగాణ ప్రజల దశాబ్దాల కలను సాకారం చేసిన నాయకుడు కేసీఆర్. అలుపెరుగని పోరాటాలతో రాష్ర్టాన్ని సాధించి అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలిపిన దార్శనిక నాయకుడిగా కేసీఆర్ దేశంలో పేరుతెచ్చుకున్నారు. కేసీఆర్ లాంటి నాయకుడు జాతీయ రాజకీయాల్లోకి వస్తే దేశం బాగుపడుతుందన్న నమ్మకం ఉన్నది. దేశంలోని అనేక పట్టణాలు హైదరాబాద్ మాదిరిగా అభివృద్ధి చేయగల తెలివి.. సామర్థ్యం కేసీఆర్‌కే ఉన్నది.
– మంజుల గంగిశెట్టి, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజినీర్, జర్మనీ