హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): ఒకేసారి 115 మంది అభ్యర్థులను ప్రకటించి దమ్మున్న లీడర్‌గా బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిలిచారని రాష్ట్ర పోలీసు హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా ప్రశంసించారు. ఈ సారి ఎన్నికలతో ఆయన సీఎంగా హ్యాట్రిక్ కొట్టబోతున్నారని ధీమా వ్యక్తంచేశారు. సమకాలీన రాజకీయ నాయకుల్లో ఇంతటి తెగువ, ప్రణాళిక, పట్టుదల, ప్రజల పట్ల ఆదరణ ఉన్న నాయకుడు దేశంలో కేసీఆర్ తప్ప మరొకరు మచ్చుకైనా కనిపించరని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయంతో విపక్షాలు ఆత్మరక్షణలో పడిపోయాయని అన్నారు. మూడు నెలలకు ముందే అభ్యర్థులను ప్రకటించి చరిత్రను తిరగరాసిన నాయకుడు కేసీఆర్ అని దామోదర్ మంగళవారం ఒక ప్రకటనలో కొనియాడారు.