హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని గన్‌పార్క్ (Gun Park) దగ్గర తెలంగాణ అమరవీరులకు (Telangana Martyrs) ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఘనంగా నివాళులర్పించారు. అమరవీరుల స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించారు. రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. అనంతరం సచివాలయానికి బయలుదేరారు. సెక్రటేరియట్లో జాతీయ జెండా ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించనున్నారు. అంతకుముందు ప్రగతి భవన్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.